సీఎం దత్తత గ్రామాల్లో పనులు పూర్తి చేయాలి

Thu,November 14, 2019 08:45 AM

అధికారులతో సమీక్షలో కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి
మేడ్చల్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ లకా్ష్మపూర్, కేశవరం, మూడుచింతలపల్లి గ్రామాల్లో జరుగుతున్న పనులపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రారంభించిన పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయడంతో పాటు మొదలు కాని పనులను కూడా వెంటనే ప్రారంభించి గడువులోపు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే పనులు పూర్తయితే యూసీలను సమర్పించాలన్నారు. అలాగే 10 ట్రాక్టర్లు, డోజర్లు, ట్రాలీలను కేవలం 10 రోజల్లోనే సమకూర్చాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. అలాగే లింగాపూర్ తండాకు శ్మశాన వాటిక కోసం అటవీ భూమిని గుర్తించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మంజూలను ఆదేశించారు.


రాజీవ్ రహదారి, అలియాబాద్, లకా్ష్మపూర్ వరకు పారిశుధ్యం, హరితహారం పనులపై కలెక్టర్ అభినందనలు తెలిపారు. మున్ముందు కూడా ఇదేస్ఫూర్తిని కొనసాగించాలన్నారు. తుర్కపల్లి గ్రామంను ఎంపీ దత్తత తీసుకుంటున్న నేపథ్యంలో చేయాల్సిన పనులపై పనులపై నివేదిక అందించాలని గ్రామ సర్పంచ్ కవితను, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే నిధులపై సమీక్షించిన కలెక్టర్ పనులను సకాలంలో పూర్తి చేసి వెంటనే యూసీలను సమర్పించాలని, లేని పక్షంలో నిధుల మంజూరులో జాప్యం జరుగుతుందన్నారు. అలాగే నిధులను నిర్దిష్ట సమయంలో వినియోగించనైట్లెతే ఆ నిధులను మరో కార్యక్రమానికి మళ్లించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీవో సౌమ్య, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

జియో రెఫరెన్స్‌తో ఓటర్ల జాబితాను సరిపోల్చండి
జియో రిఫరెన్స్ ద్వారా ఓటరు ఇంటినంబర్, ఓటర్ కార్డును సరిపోల్చాలని కలెక్టర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రంజత్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఎలక్ట్రోల్ వెరిఫికేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. దోశ రహితంగా 100శాతం ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో 1500 ఓటర్లు దాటిన పోలింగ్ బూతుల వివరాలను ఈనెల 30వ తేదీలోపు సమర్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా నక్ష తయారు చేయాలన్నారు. స్పెషల్ సమ్మరి రివిజన్, 2020 ముసాయిదాను డిసెంబర్ 16వ తేదీ లోపు పూర్తి చేయాలని, 2020 ఫిబ్రవరి 7వ తేదీ లోపు తుది జాబితాను విడుదల చేయాలన్నారు. జిల్లాలో గడపగడపకు ఓటరు పరిశీలనను పటిష్టంగా చేస్తున్నామని, ఇప్పటికే 95శాతం పూర్తయిందన్నారు. కార్యక్రమంలో జేసీ విద్యాసాగర్, డీఆర్వో మధుకర్ రెడ్డి, ఆర్డీవో మధుసూదన్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

రెవెన్యూ రికవరీ యాక్టుతో బకాయిలను రాబట్టండి
రాష్ట్రంలో 13 శాఖలకు సంబంధించిన వివిధ కేసులలో రూ.1,966 కోట్లు రావాల్సి ఉందని, ఈ నిధులను రాబట్టేందుకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్లతో విజిలెన్స్ అండ్ మానిటరింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి డిమాండ్‌కు తగ్గినట్లుగా ఆర్‌ఆర్ చట్టం కింద నోటీసులు జారీ చేసి బకాయిలను రాబట్టాలన్నారు. ప్రభుత్వ పథకాల కింద గతంలోనే నిధులు మంజూరైనా నేటి వరకు వినియోగించని నిధులు బ్యాంకులలో ఉన్నాయని, భవిష్యత్‌లో ఆడిట్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు జరిగిన ఖర్చులు, మిగిలిన నిధులు ఎన్ని అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి స్పందిస్తూ.. వాణిజ్య, గనుల, కార్మిక, రెవెన్యూ శాఖలకు సంబంధించి రూ.257 కోట్ల బకాయిలు రాబట్టాల్సి ఉందని, ఇప్పటి వరకు రూ.9.4కోట్ల వరకు వసూలు చేశామని మంత్రికి తెలిపారు. త్వరలోనే పూర్తిగా నిధులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని, బకాయిదారులందరికీ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ విద్యా సాగర్, డీఆర్‌వో మధుకర్‌రెడ్డి, ఆర్డీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల భద్రతకు చర్యలు
ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అన్నారు. బుధవారం నుంచి కలెక్టరేట్‌లోకి వచ్చే ప్రతి సందర్శకులను, ఉద్యోగులను క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తారని, ఇందులో భాగంగా పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు మెటల్‌డిటెక్టర్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles