స్నేహితుడి మరణానికి కారణమైన యువకుడికి జైలు

Fri,November 1, 2019 07:53 AM

మల్లాపూర్ : వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి.. స్నేహితుడి మరణానికి కారణమైన యువకుడికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్లితే .. దమ్మాయిగూడకు చెందిన హజరీ ప్రక్షిత్(19), రాంపల్లికి చెందిన కూరెళ్లి శశిధర్‌రెడ్డి (19 ) స్నేహితులు. 2016 డిసెంబర్ 9న హజరీ ప్రక్షిత్ బుల్లెట్ వాహనంపై స్నేహితుడు శశిధర్‌రెడ్డితో కలిసి దమ్మాయిగూడ నుంచి రాధిక చౌరస్తా వైపు వస్తుండగా బైక్ అదుపు తప్పి ఇద్దరు పడి పోయారు. ఈ ప్రమాదంతో శశిధర్ మృతి చెందాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ఆధారాలను మల్కాజిగిరి కోర్టు మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన ప్రక్షిత్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles