ఆర్డీఎస్ రైతుల కన్నీళ్లు తుడిచేందుకే తుమ్మిళ్ల

Wed,August 14, 2019 09:05 PM

telangana agriculture minister niranjan reddy started tummilla lift irrigation

జోగుళాంబ గద్వాల : ఆర్డీఎస్ రైతుల కన్నీళ్లు తుడిచేందుకే తుమ్మిళ్ల ప్రాజెక్ట్‌కు ఏర్పాటు చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం రాజోళి మండలంలోని తమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ఒక పంప్‌ను ప్రారంభించి ఆర్డీఎస్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. తుమ్మిళ్ల దగ్గర పంప్‌హౌజ్‌లో పూజ నిర్వహించి మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, జెడ్పీచైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంలు మోటర్ ప్రారంభించారు. వెంటనే ఈ నీరు 7.5కిమీ దూరంలో ఉన్న ఆర్డీఎస్ కెనాల్ డీ-75 దగ్గరి కాలువలోకి చేరుకున్నాయి. ఆర్డీఎస్ కెనాల్ దగ్గర ఉప్పొంగి ప్రవహిస్తున్న తుంగభద్ర నీటిని పూలు చల్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో నాడు గుప్పెడు నీటికోసం గొడ్డెండ్లతో సహవాసం చేసిన మనం నేడు స్వరాష్ట్రంలో సయోధ్యతో సిరులు పండించుకుంటున్నామన్నారు. రూ.790 కోట్లతో ప్రారంభించిన తుమ్మిళ్ల ప్రాజెక్ట్ పనులు కేవలం 9నెలల్లో అత్యంత వేగంగా మొదటి దశపనులు పూర్తి చేసి 2018 నవంబర్‌లో రైతులకు సాగునీటిని అందించామన్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతం 55వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. తుంగభద్ర నది వచ్చే నీటిని ఒక పంప్ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని ఆర్డీఎస్ కాలువలోకి ఎత్తిపోస్తున్నామన్నారు. నదిలో పంపింగ్ సరిపడా నీరు ఉన్నంతకాలం రైతులకు నీటిని అందిస్తామన్నారు. త్వరలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించి ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తారని, ఆ సమయంలో తుమ్మిళ్ల ప్రాజెక్ట్ రెండోదశ పనులకు సంబంధించి శుభవార్తను వింటారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఆర్డీవో రాములు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియమ్మ, జెడ్పీ మాజీ చైర్మన్ బండారు భాస్కర్, మాజీ మార్కెట్ చైర్మెన్ విష్ణువర్థన్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles