నూతన పురపాలక చట్టం బిల్లుకు కేబినెట్ ఆమోదం

Wed,July 17, 2019 09:25 PM

Telangana cabinet approves New muncipal act bill


హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది. నూతన పురపాలక చట్టం బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం..ఆ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

నూతన పురపాలక చట్టం తీసుకొచ్చేందుకు గురు, శుక్రవారాల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పురపాలకశాఖ సిద్ధంచేసిన ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం కూడా లభించింది. క్యాబినెట్‌లో ఆమోదించిన బిల్లును ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 19న ఆమోదం పొందనున్నారు. అదేరోజు కౌన్సిల్‌లోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.

2265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles