ఈనెల 27నుంచి తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్

Tue,September 24, 2019 10:12 PM

హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగానే రేపు హోటల్ ట్రిడెంట్‌లో మధ్యాహ్నం 3:30గంటలకు విలేకరుల సమావేశంనిర్వహిస్తామని తెలిపారు. ఫ్రీడం హెల్త్ కుకింగ్ ఆయిల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజం శాఖ సహకారంతో ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. తెలంగాణ రుచులతో ఫెస్టివల్ అలరించనుంది. ప్రసాద్ ఐమాక్స్, హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. విలేకరుల సమావేశంలో ఫ్రీడం హెల్త్ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్ర శేఖర రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్పర్తన్స్ మీడియా కాంతిదుట్ తదితరులు పాల్గొంటారు.

810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles