ఎన్‌డీఏకు ఎంపికైతే రూ. 2 లక్షలు

Thu,June 13, 2019 09:09 AM

telangana government 2 lakhs Prize money for National Defense Academy selected Candidates

హైదరాబాద్ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అత్యంత ప్రతి ష్టాత్మకమైన మిలిటరీ అకాడమీ. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఆర్మీ, నేవీ, ఏయిర్‌ఫోర్స్ మూడింటిలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్న సంయుక్త సైనిక శిక్షణా సంస్థ. ఇలాంటి సంస్థలో చేరిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 2లక్షలను పారితోషికంగా అందజేస్తున్నది. దేశం మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అత్య ధికంగా కొన్ని రాష్ర్టాలు కేవలం రూ. లక్ష వరకు మాత్రమే పారితోషికంగా ఇస్తుండగా తెలంగాణ సైనిక సంక్షేమశాఖ ఏకంగా రూ. 2లక్షలను పారి తోషికంగా అందజేస్తున్నది. తెలంగాణ నుంచి 29 మంది విద్యార్థులు ఎంపి కవగా, వీరందరికి ఒకేసారి రూ. 2లక్షల చొప్పున పారితోషికాన్ని అంద జేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ మొత్తం కేవలం రూ. 15 వేలు మాత్రమే ఉండగా, దానిని తెలంగాణ ప్రభుత్వం ఏకమొత్తంగా రూ. 2 లక్షలకు పెంచింది. ఇది వరకు పేద కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే పరిమితం చేయగా, తెలంగాణ ప్రభుత్వం పరిమితులన్నింటిని తొలగించి, ఎంపికైనవారందరికి పారితోషికాన్ని అందజేస్తున్నది.

ఒకే ఒక్క క్యాంపస్..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులను రాత పరీక్షను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. పురుష అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం కల్పించే ఈ అకాడమీలో అవివాహితులను మాత్రమే చేర్చు కుంటారు. మన దేశంలో మహారాష్ట్రలోని పుణే సమీపంలోని ఖడక్‌వాస్లాలో ఒకే ఒక్క క్యాంపస్‌ను నిర్వహిస్తున్నారు. పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కారాలు పొందిన వారితో అత్యదికులు ఈ అకాడమీలో శిక్షణపొందిన వారే ఉంటారు. 392 ఖాళీలకు గాను, మొత్తం 4 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరికి ఈ ఏడాది నవంబర్ 17న దేశ వ్యాప్తంగా రాత పరీక్షను నిర్వహించనున్నారు.

17న అవగాహన సదస్సు..
తెలంగాణ సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఈనెల 17న ముఖా ముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌డీఏ, ఐఎంఏ, సీడీఎస్ తదితర వాటిల్లో చేరేవారికి అవగాహన కల్పించనున్నామన్నారు. ఎన్‌డీఏలో ప్రవేశాలతో జీవితంలో ఎలా స్థిరపడొచ్చు. ఏఏ రంగాల్లో ఉద్యోగాలు లభి స్తాయి, పొందిన విద్యార్థులు, కేడెట్స్‌గా ఉన్నవారు వచ్చి తమ స్వీయ అను భవాలను పంచుకుంటారని, ఆసక్తి గల వారు ఈ అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఇతర వివరాల కోసం 87907 38657 నెంబర్‌ను సంప్రదించాలని శ్రీనేష్‌కుమార్ సూచించారు.

6150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles