తెలంగాణ దేశానికి ఆదర్శం: మంత్రి కొప్పుల ఈశ్వర్

Thu,November 7, 2019 04:44 PM

కరీంనగర్: ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నాం. కార్యకర్తలకు తగిన భాద్యతలు అప్పగిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో‌ పరిస్థితులు మారిపోయాయి. గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం దిగుబడి పెరిగింది. నెల రోజుల ముందుగానే ముఖ్యమంత్రి కేసిఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను అప్రమత్తం చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. ఏళ్లకు ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు, మంత్రులుగా పని చేసి వాళ్లు అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


2014కు ముందు, తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. బిజేపి అధ్యక్షునిగా లక్ష్మణ్ భాద్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ సర్వనాశనం అయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. హుజూర్ నగర్ ఉపఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థికి ఇండిపెండెంట్ కు వచ్చిన ఓట్లు రాలేదు. రాష్ట్ర అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు అనడానికి హుజూర్ నగర్ ఫలితమే నిదర్శనమని పేర్కొన్నారు

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles