పీసీబీ నుంచి లక్షన్నర గణపతులు

Sun,August 25, 2019 06:35 AM

telangana pollution control board distribute one Lakh fifty thousand of Ganpati

హైదరాబాద్ : పర్యావరణ వినాయక చవితి జరుపుకునేందుకు వీలుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పకడ్బందీగా ముందుకెళ్తున్నది. ఈ ఏడాది 1.64 లక్షల మట్టి విగ్రహాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. భారీ విగ్రహాలకు స్వస్తిచెప్పి.. ఈ ఏడాది చిన్న సైజు విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నది. ఒకే రకమైన సహజసిద్ధ రంగులతో విగ్రహాలకు అలంకరించి ఉచితంగా అందజేయబోతున్నారు. కేవలం 8 ఇంచుల విగ్రహాలను మాత్రమే తయారుచేయించిన అధికారులు, పండుగకు మరో వారం రోజులే ఉండడంతో విగ్రహాల పంపిణీపై అధికారులు దృష్టిపెట్టారు. ఈనెల 28 నుంచి గ్రేటర్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది దేవాలయాల్లో సైతం మట్టి విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. జంట నగరాల పరిధిలో 50 దేవాలయాల్లో 3 ఫీట్ల ఎత్తు గల సహజసిద్ధ రంగులద్దిన మట్టి విగ్రహాలను అందజేశారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రయత్నం విజయవంతమైతే దేవాలయాలన్నింటిలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు.

హెచ్‌ఎండీఏ 40వేల మట్టి గణపతులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది ఏకో గణపతులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. మట్టి గణపతులే పూజిద్దామంటూ ప్రజల్లో చైత న్యం తీసుకొచ్చేందుకు తమవంతు బాధ్యతగా ఉచితంగా ఎనిమిది అంగుళాల పొడవుతో కూడిన మట్టి విగ్రహాలను అందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ అరవింద్‌కుమా ర్ నిర్ణయించారు. ఈమేరకు 40వేల విగ్రహాలను సిద్ధ్దం చేసి ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. తార్నాకలోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, బడంగ్‌పేట మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్పిపాలిటీ, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ, మేడ్చల్ మున్సిపాలిటీ, షాద్‌నగర్ మున్సిపాలిటీ, జల్‌పల్లి, ఫిర్జాదిగూడ, భువనగిరి, మీర్‌పేట, బోడుప్పల్, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles