క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పది మంది అరెస్ట్

Mon,April 22, 2019 09:49 PM

Ten people arrested cricket betting case kothagudem

కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పదిమంది జూదరులను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్‌ను ఆసరాగా చేసుకుని లీడ్‌లో ఉన్న టీమ్‌ల పేరుతో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. కూలీలైన్ ఏరియాకు చెందిన ముత్తయ్య శంకర్ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శంకర్ ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించారు. శంకర్‌తో పాటు బెట్టింగ్ ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మిట్టపల్లి శ్రీనివాస్, కొక్కుల బుచ్చి రాములు, బండ రవి, బండ సత్యనారాయణ, శ్రీరాముల శివ కిరణ్, పాటిబండ్ల జనార్దన్, ఎండీ ఉస్మాన్, రాగి రాజు, జనగామ సత్యనారయణ ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.82,500 నగదుతో పాటు తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. జూదం నిర్వహించే శంకర్‌పై గతంలో కూడా ఐపీఎల్ బెట్టింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో ఎస్సైలు బి.శ్రీనివాసరావు, విద్యాసాగర్‌రెడ్డి, పీఎస్సై అనూష, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ జె. సుబ్బారావు, కానిస్టేబుళ్లు రాములు, రాంబాబు పాల్గొన్నారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles