తంగళ్లపల్లి పీహెచ్‌సీకి జాతీయస్థాయి గుర్తింపు

Thu,November 7, 2019 08:39 PM

సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపును సాధించింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా పేదలకు మెరుగైన వైద్యలందిస్తూ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర జాతీయ ఆరోగ్యశాఖ బృందం ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. అమాత్యుడు కేటీఆర్ చొరవ, కలెక్టర్, ప్రజాప్రతినిధుల సహకారంతో తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో జాతీయ ఆరోగ్యశాఖ బృందం పీహెచ్‌సీ సందర్శించి తనిఖీలను నిర్వహించింది.


వైద్యశాలలో అందుతున్న సేవలు, నిర్వహణ, రోగుల సంఖ్య, కమ్యూనికేషన్, పనితీరు, రోగులతో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై రెండ్రోజుల పాటు బృందం క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించింది. పీహెచ్‌సీ పనితీరుపై ప్రశంసలను కురిపింది. జాతీయ ఆరోగ్యశాఖ బృందం అందించిన నివేదిక ఆధారంగా తాజాగా తంగళ్లపల్లి పీహెచ్‌సీకి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికేట్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ మనోజ్ జలానీ గురువారం జారీ చేశారు. వైద్యశాలకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన పీహెచ్‌సీ సిబ్బందిని కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు.

685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles