కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

Sun,September 22, 2019 04:53 PM

ఖమ్మం: గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. పోలీసుల వివరాల మేరకు.. మహాబూబాబాద్ జిల్లా, చినగూడూరు మండలం, జియ్యారం గ్రామానికి చెందిన పోగుల మహిపాల్, అతని తల్లి ఇందిర, భార్య స్వాతి వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును రివర్స్ తీస్తుండగా అదుపు తప్పిన కారు కాల్వలోకి పడిపోయింది. ఈ సందర్భంలో కారు నడుపుతున్న మహిపాల్ కారు అద్దాలు పగులగొట్టుకొని ప్రాణాలతో బయటపడగా, కార్లోనే ఉన్న అతని తల్లి ఇందిర, భార్య స్వాతి మృతి చెందారు. కాగా, ఈ ఘటనలో మరణించిన మహిపాల్ భార్య 9 నెలల గర్భిని అని వారు తెలిపారు.

998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles