అసలు సిసలైన పోరాట యోధుడు కొమురం భీం: మంత్రి

Sun,October 13, 2019 12:06 PM

ఆసిఫాబాద్: కొమురం భీం అసలు సిసలైన పోరాట యోధుడని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆరాధ్యదైవం, గోండు వీరుడు కొమరం భీం 79వ వర్ధంతిని కెరమెరి మండలం జోడెఘాట్‌లో ఆదివారం అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొమురం భీం సమాధికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల ఆచార వ్య‌వ‌హారాల‌తో జ‌రిగిన పూజ‌లో పాల్గొన్న మంత్రి భీంకు నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొమురం భీం పోరాటాల యోధుడనీ, ఆయన కృషి వల్ల ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నిండయాని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం ఎప్పటకీ కృషి చేస్తూనే ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్యెల్యేలు జోగు రామ‌న్న‌, ఆత్రం స‌క్కు, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కోవా ల‌క్ష్మి, కలెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, ఐటీడీఏ పీవో కృష్ణాదిత్య, ఎస్పీ మ‌ల్లారెడ్డి, భీం వార‌సులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles