ఏడు వేల అరుదైన వ్యాధులున్నాయి

Thu,February 28, 2019 06:58 AM

There are seven thousand rare diseases

హైదరాబాద్: ప్రపంచంలో సుమారు ఏడు వేల అరుదైన వ్యాధులున్నాయని ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజ్ అధ్యక్షులు డాక్టర్ రామయ్య ముత్యాల తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెలబ్రల్ పాల్సీ, రెడ్‌రిక్స్, పాంపీ, లైజోమ్ స్టోరేజ్ డిసీజ్, ఏఎల్‌ఎస్ లాంటి ఆరుదైన వ్యాధులున్నాయని, వాటికి పూర్తి స్థాయిలో చికిత్స లేదని, కేవలం మందులతో అదుపులో ఉంచడం మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. ప్రపంచం మొత్తంలో 30 కోట్ల మంది ఉంటే ఒక్క భారతదేశంలోనే తొమ్మిది కోట్లమంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. 48 సంవత్సరాల నుంచి ఈ అరుదైన వ్యాధులపై పరిశోదనలు చేస్తూ వస్తున్నానని తెలిపారు. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం ఈ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారని గుర్తు చేశారు. అమెరికా లాంటి దేశాల్లో ఈ వ్యాధికి చికిత్స కోసం రోగులకు సహకారం అందుతుందని, అయితే భారతదేశంలో కూడా ఈ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా, హార్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని, అందుకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలన్నారు. ప్రపంచంలోని పలుదేశాలల్లో ఈ వ్యాధులపై అనేక సదస్సులు నిర్వహించానని, విశేష స్పందన లబించిందన్నారు. యూఎస్‌లోని మైన్‌సోట రాష్ట్రంలో ఈ వ్యాధులపై ప్రత్యేక పాలసీ తీసుకువచ్చారన్నారు. అరుదైన వ్యాధులు, వాటి నివారణ, చికిత్స విధానాలపై చర్చించేందుకు ఈ నెల 3న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజ్ ప్రతినిధులు డాక్టర్ ఎం. కృష్ణాజి రావు, సయ్యద్ సనాఉల్లా పాల్గొన్నారు.

1026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles