ఆర్టీసీ ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చు..!

Sun,November 3, 2019 01:28 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా బస్‌డిపోల వద్దకు ఉద్యోగులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు. విధుల్లో చేరే కార్మికులకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిపోల్లో విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామన్నారు.


తెలంగాణ ప్రభుత్వం పిలుపుమేరకు ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతికదాడులకు పాల్పడితే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెం.9490617444 సంప్రదించాలన్నారు.

3838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles