రేపు ఆయుర్వేద జాతీయ సదస్సు

Sat,August 24, 2019 09:55 PM

tomorrow ayurvedic national conference in hyderabad

హైదరాబాద్ : ఆయుర్వేదం ద్వారా చర్మవ్యాదులు, వ్యాధి నిరోదక విజ్ఞానం తదితర అంశాలపై రేపు జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు విశ్వ ఆయుర్వేద పరిషద్ తెలంగాణ విభాగం అధ్యక్షులు డా.ఎ.సమ్మిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు డా.ఎస్.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డా.విజయ్ గణేష్ రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్వ ఆయుర్వేద పరిషద్, తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో పంజాగుట్టలోని సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషియల్ స్టడీస్(సిఇఎస్‌ఎస్) ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్, తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు వివరించారు. సదస్సులో 50మందికి పైగా ఆయుర్వేద వైద్యులు వారి పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారని, అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి 600మందికి పైగా ఆయుర్వేద వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles