హెల్మెట్ పెట్టుకోండి.. వెయ్యి ఆదా చేసుకోండి

Wed,August 21, 2019 04:57 PM

హైద‌రాబాద్: ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారా ? త‌స్మాత్ జాగ్ర‌త్త‌. కొత్త చ‌ట్టాల ప్రకారం ఇక నుంచి భారీ జ‌రిమానాలు వ‌సూల్ చేయ‌నున్నారు. సెప్టెంబ‌ర్ ఒక‌ట‌వ తేదీ నుంచి ఆ వ‌సూళ్లు ఉంటాయి. కొత్త చ‌ట్టం ప్ర‌కారం.. ఒక‌వేళ ఎమ‌ర్జెన్సీ వాహ‌నాల‌కు దారి ఇవ్వ‌కుంటే.. వారి నుంచి ప‌దివేలు ఫైన్ రాబ‌ట్ట‌నున్నారు. వేటు ప‌డిన డ్రైవ‌ర్ మళ్లీ వాహ‌నాన్ని న‌డిపినా అత‌నికి కూడా ప‌దివేలు జ‌రిమానా విధిస్తారు. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం విధించ‌బోయే జ‌రిమానాల‌ లిస్టును ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ.. డ‌బ్బును ఆదా చేసుకోండి అంటూ రాసిన ఓ బ్యాన‌ర్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న‌ది.


హెల్మ‌ట్ ధ‌రించ‌కుంటే ఇక నుంచి వెయ్యి రూపాయ‌లు ఫైన్ వేయ‌నున్నారు. అయితే హెల్మెట్ పెట్టుకుంటే ఆ వెయ్యి ఆదా అయిన‌ట్లే బ్యాన‌ర్‌లో రాయ‌డం గ‌మ‌నార్హం. సీటు బెల్ట్ లేకుంటే వెయ్యి, సెల్ ఫోన్ డ్రైవింగ్‌కు 5వేలు, రాంగ్‌రూట్ డ్రైవింగ్‌కు 5వేలు, డ్రంకెన్ డ్రైవింగ్‌కు ప‌దివేలు, డేంజ‌రస్ డ్రైవింగ్‌కు 5వేలు, సిగ్న‌ల్ జంప్‌కు 5వేలు, ట్రిపుల్ రైడ్‌కు 5వేలు వ‌సూల్ చేయ‌నున్నారు. అయితే అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌న ప్రాణాలే కాదు.. డ‌బ్బు కూడా ఆదా అయిన‌ట్లే అని కొత్త ట్రాఫిక్ రూల్స్ చెబుతున్నాయి.

3180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles