ఎన్నికల నిఘా బృందాలకు శిక్షణ కార్యక్రమం

Thu,March 14, 2019 07:34 PM

Training Programme to Election Monitoring Teams


వరంగల్ అర్బన్ : లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేలా పని చేయాలని వరంగల్ అర్బన్‌ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎన్నికల నిఘా బృందాలకు సూచించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో..హన్మకొండలోని కలెక్టరేట్ లో ఎన్నికల నిఘా బృందాలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ..కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన నియమావళిని తప్పకుండ పాటించాలని నిర్దేశించారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టి డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రావి కిరణ్, సి.పి. డా. వి రవీందర్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles