ముంబైలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు..

Sun,July 28, 2019 10:46 PM

హైదరాబాద్ : ముంబై డివిజన్ పరిధిలో భారీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్-ముంబై హుస్సెన్ సాగర్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్ నాందెడ్- పన్వెల్ ఎక్స్‌ప్రెస్ 28, 29 తేదీల్లో రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. నిజామాబాద్- పండరీపూర్ ప్యాసింజర్, రాజ్‌కోట్- కోయంబత్తూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్.. తదితర రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ మార్గంలో ప్రయాణించే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ కోరింది.

494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles