9 నుంచి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో "ఆది ధ్వని'

Tue,November 5, 2019 09:22 AM

ఖైరతాబాద్ : ఈ నెల 9 నుంచి 13 వరకు ఉదయం 11.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఆది ధ్వని పేరుతో గిరిజన జానపద సంగీత వాద్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయదీర్ తిరుమల్ రావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రదర్శన బ్రోచర్లను తెలంగాణ ఆది ధ్వని అధ్యయన వేదిక కన్వీనర్ ఆచార్య గూడూరు మనోజ, ప్రతినిధులు పృథ్విరాజ్‌తో కలిసి ఆవిష్కరించారు. కావూరి హిల్స్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించే ఈ ప్రదర్శనలో ఆదివాసీ నగార, డప్పులు (గోండి), మధ్యస్థ నగారా, గోండి తుడుం, మట్టి ఢంకా, బస్తర్ నగారా, దుబ్బు వ్యాద్యం, ఔజం, వీరణాలు, రుంజులు, చామల్లాలి, మూగ, కోయడోలు తదితర 120 వాద్యాలతో ప్రద ర్శన జరుగుతుందన్నారు.

296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles