తెలంగాణకు బీజేపీ ఒరగబెట్టిందేమీలేదు: కడియం శ్రీహరి

Wed,September 4, 2019 10:07 AM

వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతాల్లో పర్యటించారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు సుమారు 5వేల మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కాళేశ్వరం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం కృష్ణా, గోదావరి నీటి హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణను ఎండబెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణకు బీజేపీ ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. ఆ పార్టీ అంపశయ్యపై ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొనే సత్తా మరో పార్టీకి లేదని కడియం పేర్కొన్నారు.

తెలంగాణ లో 22 జిల్లాలకు నీరు అందించే తెలంగాణ వర ప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు.
ప్రపంచంలో నే తొలి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం అతి తక్కువ సమయంలో చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతం.


ప్రపంచంలో ని ఇంజినీరింగ్ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు, కేంద్ర జల సంఘం అధికారులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

'కాళేశ్వరం ప్రాజెక్టు కు 82 వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయంలో ఇప్పటి వరకు 53వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కు వెళ్తున్నాం.' అని కడియం వివరించారు.

1379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles