టీ హబ్ కేటీఆర్ మానస పుత్రిక : ఎమ్మెల్యే గణేష్ గుప్తా

Fri,September 20, 2019 04:40 PM

హైదరాబాద్ : ప్రపంచ ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ సంస్థలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తెలిపారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడారు. మన రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు దాటాయి. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. భౌగోళికపరంగా పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనుకూలం. టీ హబ్ మంత్రి కేటీఆర్ మానసపుత్రిక. రూ. 300 కోట్లతో టీహబ్-2 కూడా అందుబాటులోకి రానుంది. మనిషి జీవితంలో ఇంటర్నెట్ ప్రధాన భాగమైపోయింది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అందుకనుగుణంగా ప్రజలు కూడా సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు అని ఎమ్మెల్యే గణేష్ గుప్తా పేర్కొన్నారు.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles