గుర్నాథం కుటుంబానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శ

Tue,November 5, 2019 03:20 PM

హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో హత్యకు గురైన ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో ఆమె కారు డ్రైవర్‌ గుర్నాథం తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. డ్రైవర్‌ గుర్నాథం డీఆర్‌డీఎల్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఉస్మానియా మార్చురీ వద్ద గుర్నాథం కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. గుర్నాథం కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సైదిరెడ్డి. ఆయన సతీమణి సౌందర్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని ఎమ్మెల్యే చెప్పారు. గుర్నాథం తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం దురదృష్టకరమన్నారు. ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ఇలాంటి ప్రత్యక్ష దాడులకు పాల్పడొద్దని ఎమ్మెల్యే సైదిరెడ్డి అందరికీ విజ్ఞప్తి చేశారు.

3583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles