హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే గెలుపు

Mon,October 21, 2019 08:38 PM

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 50 శాతానికి పైగా ఓట్లతో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ఆరా ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి కాగా, 53 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తుందని మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

1382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles