టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం

Mon,April 15, 2019 03:38 PM

TRS state leaders meet by CM KCR at Telangana Bhavan

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో 535 జడ్పీటీసీ స్థానాలకు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.

1078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles