మత్స్యశాఖ అధికారులకు కేటీఆర్ అభినందనలు

Sat,June 8, 2019 10:45 AM

TRS Working President KTR Praises on Fisheries dept of Telangana Govt

హైదరాబాద్ : రాష్ట్ర మత్స్యశాఖ అధికారులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. చేపల ఉత్పత్తిలో 3 లక్షల టన్నుల మైలురాయి దాటడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మత్స్యశాఖ అధికారులు, చేపల పెంపకందారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయం వల్లే ఇది సాధ్యమైందని కేటీఆర్ చెప్పారు. చేపల ఉత్పత్తి రంగానికి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయని కేటీఆర్ తెలిపారు.





1789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles