తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అనుమతి

Wed,April 19, 2017 01:22 PM

హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణ కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ. 780 కోట్ల విలువతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో రూ. 397 కోట్లు, రెండో దశలో 386 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఎత్తిపోతలలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు వద్ద జలాశయాలను నిర్మించనుంది. మొత్తంగా 55,600 గ్యాప్ ఆయకట్టుకు తుమ్మిళ్ల ద్వారా నీరందించేలా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపిన విషయం విదితమే.

634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles