శాంతి భద్రతలు మరింత పటిష్టం

Mon,September 9, 2019 12:52 PM

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను కూడా ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించిందని తెలిపారు. కొత్తగా 7 పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసి.. ప్రభుత్వం వాటి సంఖ్యను తొమ్మిదికి పెంచిందని పేర్కొన్నారు. పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు పెంచినట్లు సీఎం తెలిపారు. కొత్తగా 102 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొత్తంగా పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కు పెంచినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు.

720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles