తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Thu,July 18, 2019 06:38 AM

TTD cancels categories under VIP break darshan

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దుచేస్తున్నట్టు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. సామాన్య భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్యభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండుమూడు రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌చేసి దీన్ని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.
ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళం
ఏపీలోని గుంటూరుకు చెందిన ప్రవాసభారతీయులు జే సాంబశివ దంపతులు శ్రీ వేంకటేశ్వర వేదపరిరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles