తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సర్వం సిద్ధం.. ఈ సాయంత్రం నీటి విడుదల

Fri,November 23, 2018 03:30 PM

జోగులాంబ గద్వాల: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నీటి విడుదలకు సర్వం సిద్ధమైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా, రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామ సమీపంలో ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తుంగభద్ర నది నీటిని ఆర్డీఎస్ కాల్వకు మళ్లించి 55 వేల 600 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూ. 783 కోట్లు వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్టింది. కాగా మొదటి దశలో రూ. 389 కోట్లతో తుమ్మిళ్ల పనులు పూర్తిచేశారు. మొత్తం మూడు పంపులను ఏర్పాటు చేయగా ఒక పంపును సిద్ధం చేసిన అధికారులు ఈ సాయంత్రం నీటిని విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అనతి కాలంలోనే అతి తక్కువ సమయంలో పనులు పూర్తిచేసుకున్న ప్రాజెక్టుగా తుమ్మిళ్ల నిలిచింది. నిన్న డ్రైరన్‌ను పూర్తిచేసిన అధికారులు నేడు నీటిని విడుదల చేయనున్నారు.

1757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles