రెండు ఉడకబెట్టిన గుడ్లకు రూ.1700.. కస్టమర్‌ షాక్‌...

Wed,August 14, 2019 05:06 PM

two eggs rs1700 customer shock

ముంబై: ఇటీవలి కాలంలో ఫైవ్‌స్టార్‌ హోటల్లలో సాధారణ ఆహార పదార్థాలకు కూడా అధిక బిల్‌ వేయడం సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి సంఘటనను వెలుగులోకి తెచ్చింది బాలీవుడ్‌ నటుడు రాహుల్‌బోస్‌. గతంలో అతడు రెండు అరటిపండ్లు ఆర్డర్‌ చేసినందుకు గానూ 400రూపాయల బిల్‌ వేసింది ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటల్‌. ఈ విషయానికి సంబంధించి అప్పట్లో ఆయన ట్విట్టర్‌ మరియు ఇతర సోషల్‌ మీడియా పేజీల్లో ప్రస్తావించాడు. అది బాగా వైరల్‌ కావడంతో చాలా మంది నెటిజన్స్‌ ఆయనకు మద్దతుగా, రెస్టారెంట్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దీంతో, రెస్టారెంట్‌ ఫైన్‌ కూడా చెల్లించింది. ఇప్పుడు అలాంటి ఘటన మరొకటి జరిగింది.

కార్తీక్‌ధర్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌కు రెండు ఉడికించిన గుడ్లకు గానూ రూ.1700 బిల్‌ వేసింది ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం గరిష్టంగా ఒక గుడ్డు ధర 10రూపాయలకు మించదు. అలాంటిది అతనికి ఏకంగా 1700రూపాయలు బిల్‌ వేసింది ఆ హోటల్‌. అతడు తనకు వేసిన బిల్‌ను ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేయగా అందులో ఆమ్లెట్‌కు 850రూపాయలుగా ఉంది.


దీనిపై ట్విట్టర్‌ యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది బంగారు గుడ్డు అయ్యుంటుందని కొందరు, చాలా విలువ గల్గిందని మరికొందరు రీైప్లె ఇస్తున్నారు. ఈ ట్వీట్‌ 1800సార్లు రీట్వీట్‌ చేయబడగా, 4,000లైకులొచ్చాయి.

1913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles