రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Wed,August 14, 2019 08:53 PM

Two killed in road accident

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన తగరం వెంకటేశ్వర్లు (47), దాసరి కృష్ణయ్య (65)లు పొలం వద్ద రోడ్డు పక్కన ఎరువుల కట్టలు దింపుతున్న క్రమంలో వేగంగా వచ్చి ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు పెనుబల్లి వైద్యశాలకు తరలించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు వీయం బంజరు ఎస్‌ఐ కేసు నమోదు చేయగా సీఐ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంతో మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

1067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles