సికింద్రాబాద్: బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలోని కెవలరి బ్యారెక్స్ రైల్వేస్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.