వచ్చే నెల 25న రామప్పకు యునెస్కో టీం

Tue,August 13, 2019 09:38 PM

unesco team to ramappa on 25th september 2019

వెంకటాపూర్(ములుగు) : ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) గుర్తింపులో రామప్ప నిలువనుంది. ప్రపంచ వారసత్వ సంపదకు పుట్టినిల్లుగా పేరుగాంచుతున్న రామప్ప దేవాలయం రానున్న రోజుల్లో వర్దిల్లనుంది. అందుకోసం ఆర్కియాలజీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డాక్టర్ నంబి రాజన్ తన బృందంతో కలిసి రామప్పను సందర్శించారు. ఈమేరకు రామప్ప దేవాలయల పరిసర ప్రాంతాలు, శిల్పాల రమణీయత, గుడి నిర్మాణ వ్యవస్థ, తదితర అంశాలపై సర్వే నిర్వహించారు. వచ్చే నెల 25 వ తేదీన యునెస్కో బృందం రామప్పకు రానున్న నేపధ్యంలో వారికి సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో రామప్పకు వచ్చి సర్వే చేశారు.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles