విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులపై యూనియన్ నాయకుల దాష్టీకం..

Wed,November 6, 2019 08:56 PM

హైదరాబాద్: సమ్మె విరమించి, ప్రభుత్వ నిరయాన్ని గౌరవించి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులను యూనియన్ నాయకులు బెదిరిస్తున్నారు. వారిపై భౌతికి దాడులకు దిగుతున్నారు. విధుల్లో ఉన్న కార్మికులను అవమానించే రీతిలో వికృత చేష్టలు చేస్తున్నారు. ఇంకొంత మంది కార్మికులకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. డిపోలోకి వెళ్లి మరీ వారి విధులకు ఆటంకం కల్గిస్తున్నారు. విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్న నేతలే అడ్డుకుంటున్నారని కండక్టర్లు, డ్రైవర్లు వాపోతున్నారు. మహబూబ్‌నగర్‌లో యూనియన్ నాయకులు.. డ్యూటీలో చేరిన ముగ్గురు కార్మికుల ఫోటోలకు చెప్పుల దండలు వేసి ఊరేగించి, వారిని దారుణంగా అవమానించారు. కండక్టర్ కోమల, డ్రైవర్లు తాజుద్దీన్, వాజీద్‌లపై దాడి చేసేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారికి బందోబస్తు కల్పించిన పోలీసులు, కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యూనియన్ నాయకుల బ్లాక్ మెయిలింగ్‌తో విధుల్లో చేరిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఆర్టీసీ కార్మికుడికి రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న కార్మికులకు ఎలాంటి ఆటంకం కలిగించినా యూనియన్ నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

3719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles