ఘట్‌కేసర్‌ - బీబీనగర్‌ మధ్య గుర్తు తెలియని మృతదేహం

Fri,November 1, 2019 11:54 AM

హైదరాబాద్‌ : ఘట్‌కేసర్‌ - బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వయసు 25 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుడు బ్లాక్‌ కలర్‌ టీషర్ట్‌, బూడిద కలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు, రైలు టికెట్‌ కానీ లభించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles