ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా ఖాళీలు భర్తీ చేస్తున్నాం...

Sun,September 15, 2019 12:21 PM

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభలో ఆరోగ్యశాఖకు సంబంధించిన విషయాల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమాధానాలు చెప్పారు. ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా 12,289 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారు. 2272 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు వస్తున్నాయి. రాష్ట్రంలో కొంతమేర డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. ప్రజలకు దైర్యం చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాల తీవ్రత తక్కువగా ఉంది. డాక్టర్లు కూడా డెంగ్యూ జ్వరాల తీవ్రత తగ్గిందని అంటున్నారు. వైద్యలు తమ సెలవులు రద్దు చేసుకున్నారు. సాయంత్రం కూడా ఓపీ వైద్య సేవలు అందిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత నాలుగు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం. వైద్యానికి సంబంధించి ఏడు రంగాల్లో సమర్థత సూపించినం. గతంలో జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలు, డయాలసిస్‌లు ఉన్నాయా. తెలంగాణ వచ్చిన తరువాత డయాలసిస్ సెంటర్లతో పాటు ట్రామా కేర్, ఐసీయూ సెంటర్లను భారీగా ఏర్పాటు చేస్తున్నాం. కేసీఆర్ కిట్లు వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతంగా ఉన్న ప్రసవాలు 65 శాతానికి పెరిగాయని తెలిపారు.

1361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles