వేణుమాధవ్‌ మరణం తీరని లోటు: మంత్రి జగదీష్‌ రెడ్డి

Wed,September 25, 2019 02:11 PM

హైదరాబాద్‌: ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్‌ కాలేయ సంబంధిత వ్యాధితో ఇవాళ మరణించారు. వేణుమాధవ్‌ మరణం పట్ల తెలంగాణ మంత్రి జగదీష్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేణుమాధవ్‌ మరణవార్త నన్ను కలిచివేసింది. వెండితెరపై నవ్వులు పూయించిన హాస్యతార మరణం సినీ ఇండస్ట్రీకి, తెలుగు రాష్ర్టాలకు తీరని లోటు అని మంత్రి అన్నారు. వేణు ఎన్నో సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానానికి ఎదిగారని మంత్రి గుర్తు చేసుకున్నారు. సినీ వినీలాకాశంలో విహరించిన మేటి నటుడు మా జిల్లా వాసుడు కావడం మాకెంతో గర్వకారణమని ఆయన అన్నారు. కళామతల్లి ఒడిలో ఒదిగిపోయిన వేణు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపిన మంత్రి ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles