కొత్త పంచాయతీ చట్టం.. గ్రామాల అభివృద్ధికి మార్గం

Fri,July 5, 2019 02:47 PM

village development was our telangana government aimed says minister indrakaran reddy

నిర్మ‌ల్ : తెలంగాణలోని తండాలు, గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కొత్తగా పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చామని అట‌వీ, ప‌ర్యార‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జ‌డ్పీ కార్యాల‌యంలో జ‌రిగిన జిల్లాపరిషత్‌ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ ప‌ర్స‌న్ గా భాద్య‌త‌లు చేప‌ట్టిన కే.విజ‌య‌ల‌క్ష్మి, వైస్ చైర్ ప‌ర్స‌న్ సాగ‌ర బాయ్, జ‌డ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో ఆప్ష‌న్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎన్నిక‌ల వ‌ర‌కే పార్టీలు అని, ఎన్నిక‌ల త‌ర్వాత మ‌నంద‌రం జెండాలు ప‌క్క‌న పెట్టి అభివృద్దే ప్ర‌ధాన ఎజెండాగా స‌మిష్టిగా క‌లిసి ప‌ని చేద్దామ‌ని పిలుపునిచ్చారు. అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాలను స‌మ‌ర్ధ‌వంతంగా అమలు చేసేందుకు, స్థానిక, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేద్దామ‌న్నారు. పార్టీల‌క‌తీతంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్దిపై దృష్టి సారించాల‌ని చెప్పారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తే గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతుందని పేర్కొన్నారు.నిర్మ‌ల్ జిల్లా స‌మ‌స్య‌లను సీయం కేసీఆర్, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామినిచ్చారు. సుమారు 25 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింద‌న్నారు. చట్టాన్ని అమలు చేయడంలో అధికారులదే కీలకమైన బాధ్యత అని గుర్తు చేశారు. పచ్చదనం-పరిశుభ్రత బాధ్యతలను పంచాయతీలకే ఇచ్చామని తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశామ‌న్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్కరూ పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. మొక్కలు నాట‌డ‌మే కాకుండా వాటి సంరక్ష‌ణ భాద్య‌త‌ను కూడా తీసుకోవాల‌న్నారు. ఈ కార్యక్ర‌మంలో ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, క‌లెక్ట‌ర్ యం. ప్రశాంతి,
జడ్పీ సీఈవో, అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

2486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles