నా 2వేల రూపాయలు ఇచ్చేయ్..మారుతమ్మ వీడియో వైరల్

Wed,November 6, 2019 07:55 PM


రంగారెడ్డి జిల్లా తాసిల్దార్ హత్యకు నిరసనగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తాసిల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న రెవెన్యూ సిబ్బందిని ఓ మహిళ నిలదీసిన విషయం తెలిసిందే. అధికారులు ప్రొసీడింగ్ ఇచ్చి..పాస్‌బుక్కు కోసం రెండేండ్ల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వెలుపుల మారుతమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మరిపడిగె వీఆర్వోకు రూ.2 వేలు లంచం ఇచ్చినా పనికాలేదని మండిపడ్డారు. నేను కష్టపడి తెచ్చి ఇచ్చిన 2వేలు ఇచ్చేయ్..ఇయ్యకుంటే ఇపుడు నీ గల్ల పడ్తా అంటూ మారుతమ్మ సదరు వీఆర్వోను నిలదీసి అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుతమ్మ నిలదీయడంతో నిరసన తెలుపుతున్న సిబ్బంది మధ్యలోనే లేచి కార్యాలయంలోకి వెళ్లి పోయారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.


6007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles