సాయిరాంకు విజయవంతంగా ఆపరేషన్..కేటీఆర్ ట్వీట్

Wed,August 14, 2019 04:49 PM

young boy Sairam being able to walk normally ktr in twitter


హైదరాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయిరాం కాళ్లకు ఆపరేషన్ పూర్తయి..అతను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈ ఏడాది జనవరిలో సాయిరాం అనే బాలుడిని రామగుండం ఎమ్మెల్యే చందర్ నా దగ్గరకు తీసుకొచ్చారు. ఎముకల్లో లోపం వల్ల దొడ్డి కాళ్లతో నడవలేని స్థితిలో ఉన్న సాయిరాంకు విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత సాయిరాం అందరిలా సాధారణంగా నడవగలుగుతున్నాడు. సాయిరాంకు అండగా నిలిచిన సీఎంఆర్ఎఫ్ కు ధన్యవాదాలు. సాయిరాంతో గడిపిన క్షణాలు మంచి జ్ఞాపకాలు’గా ఉంటాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. సాయిరాం నడుస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

2151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles