గవర్నర్ నరసింహన్‌ను కలిసిన వైసీపీ, బీజేపీ నేతలు

Wed,March 6, 2019 05:52 PM

YSRCP and BJP leaders meet with ESL Narasimhan

హైదరాబాద్: గంట వ్యవధి వ్యత్యాసంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్, పార్టీ సీనియర్ నేతలు అదేవిధంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ఇతర నేతలు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా వ్యవహారంపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందని గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దీనికి పూర్తిగా ఏపీ ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరపాలని గవర్నర్‌ను కోరినట్లు.. అదేవిధంగా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

1223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles