పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: డీజీపీ

Wed,May 15, 2019 08:47 PM

ZPTC and MPTC elections end with peaceful says DGP Mahender Reddy

హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు దశల్లో జరిగిన పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల ముగింపుపై డీజీపీ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం సహకారంతో శాంతిభద్రతల సమస్య రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇటు పోలీసు అధికారులు అటు ఎన్నికల సిబ్బంది రాత్రి పగలు అని తేడా లేకుండా ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. పోలీసుశాఖకు తోడ్పడిన ఇతర శాఖలకు ధన్యవాదాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించిన ప్రజలకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.

958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles