ఫ్రిడ్జ్ వాడండిలా!


Mon,February 11, 2019 01:07 AM

ఖాళీగా ఉంది కదా అని ఫ్రిడ్జ్‌లో ఏది పడితే అది నింపుతున్నారా? ఆగండాగండి అలా చేస్తే మీ చేతులారా మీరే ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారవుతారు.
fridge
-ఫ్రిడ్జ్‌లో కమలాలు, బత్తాయి, దోసకాయ, ఉల్లిగడ్డ, టమాట, అరటి పండ్లు వంటివి పెట్టవద్దు. ఇవి పీచు కలిగిన ఆహార పదార్థాలు. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అందులోని తేమ ఎండిపోతుంది. అంతేకాకుండా త్వరగా పాడయిపోతాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన పండ్లను తింటే వ్యాధులు వచ్చే అవకాశముంది.
-మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన వెంటనే అన్నింటినీ కలిపి ఒకే చోట పెట్టకూడదు. విడివిడిగా రంధ్రాలున్న కవర్లలో పెట్టాలి.
-ఫ్రిడ్జ్‌లో భద్రపరిచిన ఆకుకూరలు కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండాలంటే ఆకు కూరల కాడలను కట్ చేసి పైభాగాన్ని కవర్‌తో కప్పి ఉంచాలి.
-ఫ్రిడ్జ్‌లో మాంసాహారాన్ని భద్రపర్చాలనుకుంటే చికెన్‌కి అంటుకున్న రక్తాన్ని శుభ్రపరచాలి. తర్వాత ఒక కవర్, పాత్రలో పెట్టుకోవాలి. పాత్రకి మూత పెట్టకపోతే ఫ్రిడ్జ్‌లో ఉన్న మిగతా పదార్థాలు పాడైపోయే అవకాశం ఉంది.

736
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles