చర్మం నల్లగా మారడానికి కారణం?


Mon,February 11, 2019 01:08 AM

మా అబ్బాయి వయసు 28 సంవత్సరాలు. కొంతకాలంగా అతడి శరీరంపై ఏవో దద్దుర్లు ఏర్పడుతున్నాయి. చర్మం నల్లగా అవుతున్నది. ఈ మార్పుకు కారణం ఏంటి? డాక్టర్‌కు చూపిస్తే అలెర్జీ.. స్కిన్ సెన్సిటివిటీ అన్నారు. పొల్యూషన్‌లో తిరగొద్దని చెప్పారు. కొంతకాలం జాబ్‌కు సెలవు పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్య ఏదైనా అయి ఉంటుందా? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆందోళనగా ఉంది. దయచేసి పరిష్కారం తెలుపగలరు.
- కే సుకన్య, సూర్యాపేట

Councelling
సుకన్యగారూ.. మీ అబ్బాయిది అలర్జీ సమస్య. ఇది అంత ప్రమాదకరం కాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలర్జీ అనేది అంటువ్యాధి కాదు. కొంతమందిలో ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కొందరిలో బయటి ఆహారం తీసుకోవడం వల్ల.. ఎక్కువ రసాయనాలు.. రంగు పదార్థాలు తీసుకోవడం వల్ల అలర్జీ సమస్య ఎక్కువ అవుతుంది. ఇక మీరు చెప్పిన స్కిన్ సెన్సిటివిటీ అనేది కూడా తీవ్రమైంది ఏమీ కాదు. చర్మం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ చర్మం. ఇంకోటి మృదుచర్మం. ఆరు వారాలకు మించి ఈ సమస్య ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఇటీవల ఇలాంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. మేం చూస్తున్నవారిలో ఎక్కువగా థైరాయిడ్.. డయాబెటిక్ వంటి సమస్యలున్నవారిలోనే ఈ చర్మ సమస్యలు కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా కూడా చర్మంలో మార్పులు కనిపిస్తుంటాయి. రంగు మారుతుంది. స్కూల్ ఏజ్‌లో ఉన్న చర్మ రంగు.. మృదుత్వం ముప్పయేళ్లు దాటిన తర్వాత కనిపించదు. కాబట్టి స్కిన్‌సెన్సిటివిటీ.. ఫొటో అలర్జీ ఉన్నవాళ్లు ఏ మందు పడితే అది వాడొద్దు. సమస్య ఉన్నట్లు తెలిసిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అది తీవ్రం కాకుండా చూసుకోవాలి. మీ అబ్బాయిని వెంటనే డెర్మటాలజిస్ట్‌కు చూపించండి.

డా. భూమేష్ కుమార్
సివిల్ అసిస్టెంట్ సర్జన్,
డెర్మటాలజిస్ట్
గాంధీ హాస్పిటల్

925
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles