తల్లులు నడిపే పిల్లల పత్రిక


Thu,March 14, 2019 11:59 PM

ఒక్కోసారి పిల్లల ప్రశ్నలు ఎన్నో ఆలోచనలను సంధిస్తాయి. భవిష్యత్‌లో ఆవిష్కరణలకు దోహద పడతాయి. తల్లిదండ్రులను సంఘర్షనలో పడేస్తాయి. అలాంటి కథే యంగ్ క్రానికల్ పిల్లల ప్రతికది.
paper
ఓ నాలుగేండ్ల పాప రోజూ తల్లిని ఎన్నో సందేహాలు అడిగేది. తరచూ ప్రశ్నలతో తల్లిని హడావుడి చేసేది. ఆ ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో ఆ తల్లి ఓ పత్రికను స్థాపించే వరకూ వెళ్లింది. అహ్మదాబాద్‌కు చెందిన రితికా అనే మహిళ ఈ పత్రికను స్థాపించింది. తన లాంటి తల్లులను ఇందులో భాగస్వామ్యం చేసింది. ఉద్యోగాల రీత్యా డే కేర్ సెంటర్లలో పిల్లలను ఉంచే తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి, పిల్లల సందేహాలు తీర్చడానికి ప్రత్యేకంగా ఈ పత్రికను నిర్వహిస్తున్నది. 2009లో ఎంబీఏ చదువుతున్న రితిక మొదట అచ్చాబచ్చా అనే సోషల్ నెట్‌వర్కింగ్ టూల్‌ను తయారు చేసింది. దాని ద్వారా పిల్లలకు ఉపయోగపడే పేరెంటింగ్ ఆర్టికల్స్‌ను ప్రచురించేది. తన లాంటి తల్లుల నుంచి కూడా ఆర్టికల్స్ తీసుకునేది. అనుభవాజ్ఞలైన వారి నుంచి పేరెంటింగ్ ఆర్టికల్స్ సేకరించి ఫస్ట్ జనరేషన్ తల్లులకు అందించేందుకు కృషి చేసేది. ఆన్‌లైన్ వేదికగా విస్తరించిన ఆమె ఆలోచన పత్రిక వైపు సాగింది. వివిధ రంగాల్లో స్థిరపడ్డ తల్లులను భాగస్వామ్యం చేసి ఈ పత్రిక ప్రారంభించింది. ఒక బలమైన తల్లుల వ్యవస్థను రితిక ఏర్పాటు చేసింది. ప్రధానంగా పిల్లలకు అర్థమయ్యే, ఉపయోగపడే వ్యాసాలుంటాయి. తల్లులు రాసే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, పేరెంటింగ్ సలహాలు ఇవ్వడం ప్రధానంగా కనిపిస్తాయి. అయితే తల్లుల నుంచి వచ్చే ప్రశ్నలు ఏ వయస్సు పిల్లలకో ముందే తెలుసుకుని జవాబులు ఇస్తుంటారు. పిల్లల్లో ఉండే వివిధ రకాల లెర్నింగ్ లెవెల్స్‌ను బట్టి ఈ పత్రిక సలహాలు ఇస్తుందని రితిక చెబుతోంది. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి పిల్లలు ఒక కేటగిరి, నాలుగు నుంచి ఏడో తరగతి పిల్లలకు ఒక కేటగిరిగా విభజించి వారి రీడింగ్ లెవెల్స్‌కు తగ్గ ఆర్టికల్స్ ప్రచురిస్తుంది. అయితే ఈ పత్రికలో మహిళకు, తల్లులకు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తుంది రితిక. ఒకే ఆలోచన ఉండి, కొత్త విధంగా ఆలోచించే వారిని ప్రోత్సహిస్తున్నామని చెపుతున్నది.

715
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles