అందానికి టూత్‌పేస్ట్!


Fri,March 15, 2019 12:00 AM

టూత్‌పేస్ట్ దంతాలను శుభ్రం చేయడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. తెల్లటి పేస్ట్ అందాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరెన్నో పనులకూ వాడొచ్చు. పేస్ట్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
paste
-తెల్లని పేస్ట్‌ను వాడేముందు దానిపై రాసిన ఇంగ్రీడియంట్స్‌ను చూడాలి. దీన్ని ముందుగా కొంచెం చేతికి రాసుకొని ఐదు నిమిషాల పాటు వదిలేయండి. మంట, దురద, ఎలర్జీలు ఏమైనా వస్తే ఈ చిట్కాలను పాటించవద్దు.
-టూత్‌పేస్ట్‌కి కొంచెం తేనె జోడించి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మొటిమల సమస్య ఉండదు.
-టూత్‌పేస్ట్, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి కలుపాలి. మిశ్రమాన్ని ముఖానికి రాసే ముందు ముఖానికి ఆవిరి పట్టాలి. తర్వాత మిశ్రమాన్ని ముఖానికి రాయలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు మాయమవుతాయి.
-రాత్రిపూట నిద్రించేముందు ముడుతలున్న చర్మానికి పేస్ట్ రాసి పడుకోవాలి. ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మాములు స్థితికి వస్తుంది. ఎండకి చర్మం కందితే కాస్త నిమ్మరసం, పేస్ట్ కలిపి చర్మానికి రాయాలి.
-టూత్‌పేస్ట్ అందానికే కాదు ఇతర పనులకూ ఉపయోగించవచ్చు. పూజకి ఉపయోగించే వస్తువులకి అంటిన మరకలను తొలిగించాలంటే వాటిని పేస్ట్ రాయాలి. రాత్రంతా అలానే ఉంచి మరుసటి ఉదయం గట్టిగా రుద్దితే మరకలు పోతాయి.

576
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles