కాంజీవరం చీరలో..కాకతీయ శిల్పంలా


Fri,March 15, 2019 01:14 AM

పెండ్లీల సీజన్.. సమ్మర్ ధమాకా మొదలయ్యాయి.. ఈ సమయంలో.. కంచిపట్టు చీర కట్టి.. జడలోనా జాజులెట్టి.. కన్నె కనుల ముందు తిరుగుతుంటే.. చూపు తిప్పడం ఎవరి తరమూ కాదు.. అందుకే పడుతుల మొదటి ఓటు.. కంచి పట్టు చీరకే! ఈ సీజన్ సాఫీగా.. సౌకర్యంగా సాగిపోవాలన్నా..
మీరు అందరిలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలువాలన్నా.. కాంజీవరం కలెక్షన్‌ని ఓసారి చూడండి..

Sarees

సంప్రదాయతకు అద్దం పట్టేలా ఈ చీర కనిపిస్తున్నది. ఆరెంజ్ కలర్ ప్యూర్ కాంజీవరం పట్టు చీర ఇది. దీనికి గోల్డెన్ జరీ బార్డర్, దాంతో పాటు కొద్దిగా షేడెడ్ బార్డర్స్ చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. పల్లూ హెవీగా జరీతో నింపిడిపోవడంతో గ్రాండ్ లుక్ సొంతమైంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే మరింత బాగుంటుంది.

స్పెషల్‌గా కనిపించాలంటే..స్పెషల్ కలర్స్ ఎంచుకోవాలి! యెల్లో కలర్ ప్యూర్ కంచిపట్టు మీద గ్రీన్ షేడ్‌తో సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. చీర మొత్తం చిన్న చిన్న మోటివ్స్ చీరకు మరింత అందాన్ని తెచ్చాయి. ఇక వివిధ రంగుల్లో వచ్చిన అంచు ఈ చీరకి హైలైట్‌గా నిలుస్తుంది. మల్టీ కలర్ బ్లౌజ్ వేస్తే మరింత బాగుంటారు. తె

ల్లని తెలుపే.. మది తెలిపే అని పాడుకోవాలి ఈ చీరను చూస్తే! ఫుల్‌గా సెల్ఫ్ మోటీవ్స్‌తో వీవింగ్ వచ్చిన ప్యూర్ కంచి పట్టు చీర ఇది. దీనికి రాయల్ బ్లూ కలర్ అంచు, పల్లూ మరింత హైలైట్‌గా నిలిచాయి. వీటి మీద కూడా సిల్వర్‌తో వచ్చిన మోటివ్స్ సూపర్‌గాకనిపిస్తున్నాయి. రాయల్ బ్లూ బ్లౌజ్ మరింత రాయల్
లుక్ తెచ్చిపెట్టింది.

నిండుగా కనిపించాలంటే ఈ చీర ఎంచుకోవాల్సిందే! వంకాయ రంగు కంచిపట్టు చీరకి హెవీ జరీ బుటీ చ్చింది. మధ్యమధ్యలో వచ్చిన నెమళ్లు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఎర్రని బార్డర్ మీద గోల్డెన్ జరీతో వచ్చిన డిజైన్, ఎర్రని పల్లూ మీద హెవీ డిజైన్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఎర్రని బ్లౌజ్ దీనికి పర్‌ఫెక్ట్ మ్యాచింగ్.

ప్యూర్ కాంజీవరం చీర ఎక్కడ ఉన్నా మిమ్మల్ని సపరేట్ లుక్‌తో చూపిస్తుంది. సీ బ్లూ కలర్ కాంజీవరం చీరకి బ్లూ, గోల్డెన్ షేడెడ్‌తో అంచు వచ్చింది. ఇక చీర మొత్తం తామర పూల మోటీవ్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఈ చీరకి పల్లూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. దీనికి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్
అవుతుంది.
కామాక్షి మహంకాళిఫౌండర్/చైర్మన్ www.vynam.com లార్జెస్ట్ సిల్క్ అండ్
హ్యాండ్‌లూమ్ కలెక్షన్స్ ఫోన్ : 8296848484 9000564333

621
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles