సేంద్రియ సాధనం!


Mon,March 18, 2019 01:00 AM

మీ పెదాలకు పెట్టే లిప్‌స్టిక్ ఎంతవరకు మంచిది? మేకప్ వేసుకునేటప్పుడు అది మీ శరీరానికి నష్టం చేస్తుందని ఎప్పుడూ అనిపించలేదా? ఇకనుంచైనా ఆర్గానిక్ లిప్‌స్టిక్స్‌ను వాడండి..
lipsticks
మహిళలు సహజంగానే సౌందర్యాన్ని కోరుకుంటారు. సాధ్యమైనంతవరకూ అందంగా కనిపించాలని, ఆనందగా జీవించాలని అనుకుంటారు. అలాంటి అందం కోసం సౌందర్య సాధనాల్లో ఒకటైన లిప్‌స్టిక్‌ను ఎక్కవగా వాడతారు. అందమైన పెదాలకు లిప్‌స్టిక్ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. ప్రపంచంలోనే తొలిసారి ఈజిప్టులో తయారైన రసాయనాల లిప్‌స్టిక్ భూమండలాన్ని అంతా చుట్టేసింది. ఆరోగ్యానికి హాని కలిగించే ఎన్ని మేకప్ ఉత్పత్తులు ఉంటే ఏం లాభం? వాటివల్ల నష్టాలే తప్ప లాభం లేదు. ఆర్గానిక్ కాస్మొటిక్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా? వీటివల్ల మీ శరీరానికి ఎలాంటి నష్టం జరుగదు. అనారోగ్యాలను తీసుకొచ్చే కాస్మోటిక్స్‌కు సలాం కొట్టి ఆర్గానిక్ వస్తువులకు వెల్‌కమ్ చెప్పండి.

రసాయన రంగులు కలిసిన లిప్‌స్టిక్స్ ఎంత ఖరీదైనవి అయితే ఏంటి? అవి పెదవులను పాడు చేస్తుండడమే తప్ప ఏమీ ఉండదు. ఆర్గానిక్ బ్రాండ్స్‌కు సంబంధించిన వస్తువులు మృదువుగా ఉండకపోయినా షైనింగ్ లేకపోయినా సహజత్వాన్ని ఇస్తాయి. 1971లో మొట్టమొదటిసారి మైనం, ఆముదం, సహజ పదార్థాలను వాడి ఆర్గానిక్ లిప్‌స్టిక్‌ను తయారు చేశారు. అయినా వాటికి అంతగా డిమాండ్ లేకపోవడం ఆలోచించాల్సిన అంశం. ముఖ్యంగా లిప్‌స్టిక్స్‌లలో ఆర్గానిక్‌కు సంబంధించినవి పదిరకాల బ్రాండ్లు మార్కెట్‌లో ఎక్కువ కనబడతాయి. ఈ సారి షాపింగ్‌కు వెళ్లినప్పుడు వీటిని ట్రై చేయండి. సోల్ ట్రీ, హెంప్ ఆర్గానిక్స్, ఎకోబెల్లా, బరె మినరల్స్, జోసి మారన్, ఇనికా, న్యూడ్స్, పౌల్ పెండర్స్, రూబీ ఆర్గానిక్, లిల్లా వంటి ఆర్గానిక్ బ్రాండ్ లిప్‌స్టిక్స్ మీ మృదువైన పెదాలకు ఎలాంటి నష్టం చేయవు.

626
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles