సూపర్ లిల్లీ!


Mon,March 18, 2019 11:00 PM

superwomen
ఉద్యోగంలో నైట్‌షిప్ట్ అనేసరికి ఆడవాళ్లు ఆలోచిస్తుంటారు. కానీ భిన్నంగా ఉండడంలో యూట్యూబ్ స్టార్ లిల్లీసింగ్ ఓకే చెప్పింది. అమెరికన్ లేట్ నైట్ షోకి మొదటి మహిళా హోస్ట్‌గా ఎంపికయింది.


ఇండియన్ యూట్యూబ్ స్టార్ లిల్లీసింగ్.. అమెరికన్ ఎన్‌బీసీ చానెల్‌లో ప్రసారమయ్యే లేట్ నైట్ షోకి హోస్ట్‌గా ఎంపికైంది. గతంలో లేట్ నైట్ షోకి కర్సన్ డలే హోస్ట్‌గా ఉండేవాడు. ఈ నెల 14న కర్సన్‌కి బదులుగా లిల్లీ సింగ్‌ను నియమించినట్టు ఎన్‌బీసీ యాజమాన్యం ప్రకటించారు. ఈ షో రాత్రి 1.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. నైట్ షో అంటే పురుషులే బాధ్యత వహించేవారనుకుంటారు. కానీ, మొదటిసారి లేట్-నైట్ షోకి ఒక మహిళ, అది కూడా భారతదేశానికి చెందిన లిల్లీ ఎంపిక కావడంతో అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సెప్టెంబర్ నుంచి హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నానని స్టారింగ్ జిమ్మీ ఫాలన్ షోలో లిల్లీ ప్రకటించింది. దీంతో పాటు లిల్లీకి యూట్యూబ్‌లో సూపర్ ఉమెన్ పేరుతో చానెల్ కూడా ఉంది. అంతేకాదు కోట్లలో సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. చానెల్‌లో వచ్చే లిటిల్ లేట్ విత్ లిల్లీ సింగ్ షోకి తానే హోస్ట్‌గా చేయనున్నది. ఎన్‌బీసీ లేట్ నైట్ ఫ్యామిలీ జిమ్మి ఫాలన్, సేథ్ యేయర్స్‌తో భాగస్వామురాలు అయినందుకు లిల్లీ ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పటికి నా ప్రయత్నం ఫలించింది. ఒక భారతీయురాలిగా అమెరికన్ నైట్ షోకి విధులు నిర్వహించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. మున్ముందు పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి అందరినీ అలరిస్తానంటున్నది లిల్లీ.

843
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles