రెట్టింపు అందానికి.. పుచ్చకాయ!


Tue,March 19, 2019 01:03 AM

watermelon
ఎండాకాలంలో పుచ్చకాయ తక్షణ శక్తినిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, ఖనిజాలు డీహైడ్రేషన్‌కి చెక్ పెడుతాయి. పుచ్చకాయను సౌందర్య పోషణకు కూడా ఉపయోగించవచ్చు.

- పుచ్చకాయ రసం, తేనె కలిపి ముఖానికి, మెడకు మర్దన చేసి, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే నల్లగా మారిన మెడభాగం మామూలు స్థితికి వస్తుంది.
- ముఖంపై పేరుకునే జిడ్డును తొలిగించడానికి పుచ్చకాయ గుజ్జులో, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. పావుగంట సేపు అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేస్తే సరి.
- పుచ్చకాయ రసం, విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.
- పుచ్చకాయ రసం, కీరదోస గుజ్జు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసి పావుగంట సేపు ఉంచాలి. ఆరిన తర్వాత కడగాలి. వారానికొకసారి ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతమవుతుంది.
- పుచ్చకాయ గుజ్జు, అరటిపండు గుజ్జు రెండింటినీ బాగా కలుపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట తర్వాత కడగాలి. అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచేందుకు చాలా ఉపయోగపడుతాయి. అందుకే వారానికొకసారి ఈ ప్యాక్ ప్రయత్నిస్తే మీ ముఖం చందమామలా మెరిసిపోతుంది.

594
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles